Monday, December 23, 2024

ప్రైవేటు విద్యా సంస్థల్లో పీఎఫ్​, ఈఎస్​ఐ అమలు చేయాలి

  • బీఎంఎస్​ జిల్లా అధ్యక్షుడు పసుల శ్రవణ్​

నేటి సాక్షి, కరీంనగర్​: ప్రభుత్వ ఆమోదిత ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో బోధనేతర సిబ్బందికి ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పసుల శ్రవణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్​లోని బీఎంఎస్ కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య​అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి ఈఎస్ఐ, పీఏఫ్​ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచన చేయాలని సూచించారు. లేనిపక్షంలో బీఎంఎస్ ఆధ్వర్యంలో కార్యాచరణ చేపట్టి, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఎంఎస్ రాష్ట్ర నాయకులు పప్పుల సురేష్, జిల్లా నాయకులు ఎండీ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News