– స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్
నేటి సాక్షి, కరీంనగర్: అధికారులు విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలందించినప్పుడే ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కరీంనగర్‌లోని కృషి భవన్లో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ పుల్లా నతానియేలు ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 40 సంవత్సరాలపాటు నతానియేలు అత్యుత్తమ సేవలందించి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. ఏ పని అప్పగించిన నిస్వార్థంగా, అంకితభావంతో పూర్తి చేసే వారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో పుట్టి జాబ్ సంపాదించుకొని, తిరిగి ఇక్కడే ఉద్యోగ విరమణ చేయడం చాలా అరుదు అని చెప్పారు. 40 సంవత్సరాల పాటు సేవలందించడం ఆషామాషీ కాదని పేర్కొన్నారు. నతానియల్ సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, సోషల్ వెల్ఫేర్ అధికారులు సిబ్బంది విరమణ పొందిన నతానియేలును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ పవన్‌కుమార్, ఆర్డీవో ముఖ్య మహేశ్వర్, సీపీవో కొమురయ్య, వయోజన విద్య డీడీ జయశంకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.