నేటి సాక్షి, తిమ్మాపూర్: తిమ్మాపూర్ మండలం అలుగునూర్ పరిధి శ్రీ వేంకటేశ్వరకాలనీలోని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం హనుమాన్ జన్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకలను పురస్కరించుకుని దేవాలయంలోని ఆంజనేయస్వామికి ఉదయం వేళ ప్రత్యేక అభిషేక, పూజా కార్యక్రమాలను వేద పండితులు తిరునగిరి చక్రధర స్వామి, విష్ణువర్ధనాచారి కన్నుల పండుగగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులతో దేవాలయ ప్రాంగణం కిటకిటలాడింది. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ వేడుకల్లో దేవాలయ కమిటీ అధ్యక్షుడు చిందం నరసయ్య, గడప శేఖర్, సిరిపురం శ్రీనివాస్, బూట్ల కర్ణాకర్ , బైరి లక్ష్మయ్య , రాజేందర్, సుధాకర్ రెడ్డి, రాజిరెడ్డి, మృత్యుంజయం, చిందం అంజి, మల్లేశం లతోపాటు వెంకటేశ్వరకాలనీ ప్రజలు, మహిళలు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.