Monday, December 23, 2024

ఒడిశా టు మహారాష్ట్ర.. కరీంనగర్​లో పట్టివేత

  • కరీంనగర్ బైపాస్​లో 70 కిలోల గంజాయి స్వాధీనం
  • ఏపీకి చెందిన ఇద్దరు, మహారాష్ట్రకు చెందిన ఒకరు అరెస్ట్

నేటి సాక్షి, కరీంనగర్​ క్రైం: కరీంనగర్​లో భారీగా గంజాయి పట్టుబడింది. శనివారం బైపాస్ వద్ద కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా, కారు(ఏపీ 31 బీహెచ్​ 2925)లో గంజాయి గుర్తించారు. అందులో ప్రయాణిస్తున్న విశాఖ జిల్లా కొమ్మాదికి చెందిన సెరకనం రామకృష్ణ, కాకినాడ జిల్లా కిర్లంపూడికి చెందిన దొడ్డి మణికంఠ, మహారాష్ర్టకు చెందిన ధర్మేంద్రకుమార్​ను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 70 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. గంజాయి పట్టివేతకు కృషిచేసిన వన్ టౌన్ ఇన్​స్పెక్టర్​ సరిలాల్, ఎస్సై స్వామితో పాటు సిబ్బందిని టౌన్ ఏసీపీ అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News