- మైనార్టీ జిల్లా అధ్య క్షుడు ఎండీ యాకూబ్ పాషా
నేటి సాక్షి, కొత్తగూడెం: నిర్మల్ జిల్లా బాసరలోని “రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీస్”లో మొదటి సంవత్సరం ఇంటిగ్రేటెడ్ బీటెక్‌లో ప్రవేశాలకు ఆన్‌లైన్ ప్రారంభమైనదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యేడాది పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులని చెప్పారు. ఈ కాలేజీలో కన్వీనర్ కోటాలో 1500, గ్లోబల్ (మేనేజ్ మెంట్ కోటాలో) 150 సీట్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. మెరిట్, రిజర్వేషన్లను బట్టి సీట్లు కేటాయిస్తారని వివరించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు రూ.2 లక్షల ఆదాయ ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు 3 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, పదో తరగతి మార్కుల జాబితా, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, తీసుకొని ఈ నెల 22 లోపు www.rgukt.ac.in వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని అన్నారు. పీహెచ్సీ, ఎన్సీసీ, స్పోర్ట్స్, సీఏపీ (ఆర్మీ ఉద్యోగుల పిల్లలు) మాత్రం తప్పనిసరిగా ఆన్లైన్లో చేసిన దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని, దరఖాస్తుపై విద్యార్థి సంతకం చేసి, ఈ నెల 29లోపు కాలేజీకి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8520860785, 7416305245, 7416058245ను సంప్రదించాలని సూచించారు.