- – గన్నేరువరంలో యథేచ్ఛగా అమ్మకాలు
- – నిద్రమత్తులో అధికార యంత్రాంగం
నేటి సాక్షి, గన్నేరువరం: మండలంవ్యాప్తంగా గుట్కా, పాన్ మసాలా విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నాయి. బెల్ట్ షాపుల్లో అడ్డు అదుపు లేకుండా మద్యం అమ్మకాలు నడుస్తున్నాయి. బెల్టు షాపులతో పాటు కిరాణా షాపులు, పాన్ డబ్బాల్లో కూడా ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో బెల్టు షాపుల్లో మద్యం ఏరులై పారుతున్నది. బెల్ట్ షాపుల్లో మద్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు చూసి చూసినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయా గ్రామాల్లో విచ్ఛలవిడిగా బెల్టు షాపులు.. కిరాణం దుకాణంలో మద్యం, గుట్కా, పాన్ మసాలాలు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా పల్లెల్లో, గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్ఛలవిడిగా వెలిశాయి. జంగపల్లి, గునుకుల కొండాపూర్, చీమలకుంటపల్లె,,హనుమాజ్పల్లి ఎక్స్‌రోడ్, మైలారం, కాసింపేట, గన్నేరువరం, మాదాపూర్ కిరాణా షాపుల్లో, గుండ్లపల్లి స్టేజీ వద్ద పాన్ డబ్బాల్లో గుట్కా ప్యాకెట్లు జోరుగా అమ్ముతున్నారు. ఇదంతా అధికార కనుసైగల్లో నడుస్తున్నాయని, వీటి మీద ఎందుకు దాడులు చేస్తలేరని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు బెల్టు షాపులో తనిఖీలు నిర్వహిస్తలేరని మహిళలు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం గుట్కా, పొగా ఉత్పత్తుల మీద ఉక్కు పాదం వేసినా మండలంలో వీటి మీద అధికారులు తనిఖీ చేసిన దాఖలాలు లేవని ప్రజలు అంటున్నారు. ఏదిఏమైనా సంబంధిత అధికారులు మండలంలోని పలు గ్రామాల్లోని బెల్టు, కిరాణా షాపుల్లో తనీఖీలు నిర్వహించి, చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.