నేటిసాక్షి,గన్నేరువరం : తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గన్నేరువరం మండల వ్యాప్తంగా ఆదివారం అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు , ప్రజలు జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రము లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి లింగాల మల్లారెడ్డి, తహశీల్దార్ కార్యాలయం లో తహాశీల్దార్ బిక్షపతి, పోలీసు స్టేషన్ లో ఎస్సై తాండ్ర నరేశ్, మహిళా సమాఖ్య లో ఏపిఎం లావణ్య, వ్యవసాయ శాఖ లో కిరణ్మయి, మరియు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో , అధికారులు, పోరాడి సంపాదించుకున్న తెలంగాణా రాష్ట్రం పురోగమిస్తోందని, అవరోధాలను అధిగమిస్తూ ఉందని భవిష్యత్తు బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జయహో తెలంగాణ అంటూ కీర్తించారు.జై తెలంగాణ నినాదాలతో అభిమానం చాటుకున్నారు. ఈ వేడుకల్లో ఎంపీడీవో తీగల శంకర్, ఎంపీఓ నర్సింహారెడ్డి, నాయకులు చిట్కూరు అనంతరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు, చింతల శ్రీధర్ రెడ్డి కొమ్మెర రవీందర్ రెడ్డి మార్గం మల్లేశం , దుడ్డు మల్లేశం బద్దం సంపత్ రెడ్డి బొడ్డు సునీల్, మైసంపల్లి తిరుపతి బుర్ర మల్లేశం గౌడ్ నక్క అంజయ్య దేశ రాజ్ అనిల్ రాజయ్య విజేందర్ మాతంగి అనిల్, తదితరులు పాల్గొన్నారు.

