నేటి సాక్షి, బెజ్జంకి: మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, నాయకులు లింగాల లక్ష్మణ్, రాజమహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, నరేష్ మల్లేశం, దేవయ్య, శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

