నేటి సాక్షి, బెజ్జంకి: మండల కేంద్రంతోపాటు గాగిల్లాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని సిద్దిపేట డిఈఓ శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి యూనిఫాంలో అందించాలి సూచించాడు. నాణ్యతగా కుట్టాలని, సకాలంలో యూనిఫాం లు అందించి పాఠశాలల నిర్వహణకు సహకరించాలి కోరాడు. ఆయనతో ఏపీఎం నరసయ్య, సిసి లు సారయ్య, తిరుపతి, మహిళా సంఘాల సభ్యులు తదితరులున్నారు.