నేటి సాక్షి, బెజ్జంకి : బీజేపీకి కూటమికి పార్లమెంట్లో అత్యధిక స్థానాలు రావడంతో పాటు కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ గెలిచినందుకు ఆపార్టీ నాయకులు మంగళవారం సంబురాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొలిపాక రాజు, నాయకులు సంఘ రవి, సునీత, లావణ్య,కిషన్, నరేష్, శంకర్, టీడీపీ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.