Monday, December 23, 2024

సక్సెస్ ఫుల్​గా గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించాలి

  • – కరీంనగర్​ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
  • – గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాల సూపరిండెంట్లు, అబ్జర్వర్లకు శిక్షణ

నేటి సాక్షి, కరీంనగర్​: ఈ నెల 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను అధికారులు సక్సెస్ ఫుల్​గా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. అభ్యర్థుల భవిష్యత్తు దృష్ట్యా చిన్న తప్పునకు ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్​లోని మహిళా డిగ్రీ కళాశాలలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లకు శిక్షణ నిర్వహించారు. దీనికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్​తో కలిసి కలెక్టర్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు టీజీపీఎస్సీ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఆ మేరకు జాగ్రత్తగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని సూచించారు. ఈ నెల 9న ఉదయం 9 గంటల వరకే పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలని పేర్కొన్నారు. బయోమెట్రిక్ హాజరు విధానం ఉంటుందని తెలిపారు. 10 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారని చెప్పారు. ఉదయం 10:30 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ప్రైవేటు కళాశాలల పరీక్ష కేంద్రాల్లో అనవసరమైన వ్యక్తులు పరీక్ష రోజున ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పకడ్బందీగా విధులు నిర్వర్తించా లని పేర్కొన్నారు. ఏ చిన్న తప్పు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్ష పూర్తయిన తర్వాత ఓఎంఆర్ షీట్లు, హాజరైన అభ్యర్థుల సంఖ్య తేడా రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. పరీక్షకు రెండు రోజుల ముందే సెంటర్ల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొబైల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రాల్లో అనుమతి లేదని తెలిపారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. పరీక్ష ప్రశాంతంగా సాగేలా ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలని తెలిపారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత కేంద్రాల్లోకి అనుమతించా లని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు సరిగా పని చేస్తున్నాయో లేదో ఒకరోజు ముందే చూసుకో వాలని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కేంద్రాల్లో కనిపిస్తే క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అభ్యర్థుల సిట్టింగ్ ఆరేంజ్మెంట్లు పక్కాగా నిర్వహించాలని, ఇబ్బందు లు పడకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ డీ శ్రీ లక్ష్మి, కొండగట్టు జేఎన్టీయూ ప్రొఫెసర్ బీ సతీష్ కుమార్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కాళీచరణ్, పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News