Sunday, January 18, 2026

స్వాధార్ హోమ్​లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

నేటి సాక్షి, కరీంనగర్​: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే వెంకటేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్వాధార్ హోమ్​లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు కార్బన్​డై యాక్సైడ్​ను గ్రహించి, మనకు కావాల్సిన ఆక్సిజన్​ను చెట్లు అందిస్తాయని, ప్రతి మనిషి ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. వృక్షో రక్షిత రక్షితః వృక్షాలను మనం రక్షిస్తే, మనల్ని వృక్షాలు రక్షిస్తాయని తెలిపారు. ఇప్పుడు వాతావరణంలో వస్తున్న మార్పులకు మనము వృక్షాలని నిర్లక్ష్యం చేయడమే కారణమని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శితో పాటు లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్​, స్వాధార్​ హోమ్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News