నేటి సాక్షి, హైదరాబాద్: తన సమాధి ఎక్కడ ఉండాలో రామోజీరావు ముందే నిర్ణయించారని టీడీపీ నేత, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తన ఎక్స్ ఖాతా ద్వారా వీడియోలో చెప్పారు. వీడియోలో రామోజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఓ ప్లేస్‌ను తన సమాధి కోసం ఎంపిక చేశారని, దానిని ఉద్యానవనంలా తీర్చిదిద్దారని ఆయన వీడియోలో చెప్పుకొచ్చారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.

