- – ఐక్యూఏసీ డైరెక్టర్లకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళన
నేటి సాక్షి, రాజేంద్రనగర్: సీబీఐటీలో లైంగిక వేధింపులు తాళలేక ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఐక్యూఏసీ డైరెక్టర్లు సుశాంత్‌బాబు, త్రివిక్రమ్ కొంతకాలంగా మహిళా ప్రొఫెసర్లను లైంగికంగా వేధిస్తున్నారు. దీనిపై మహిళా ప్రొఫెసర్ కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రిన్సిపాల్ వైఖరితో కంగుతిన్న మహిళా ప్రొఫెసర్.. తన సహోద్యోగులకు జరిగిన విషయాన్ని చెప్పి కన్నీటి పర్యంతమైంది. దీంతో బోధన, బోధనేతర సిబ్బంది మొత్తం ఏకమై ఐక్యూఏసీ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. మహిళా ప్రొఫెసర్‌కు న్యాయం చేయాలని, డైరెక్టర్లు సుశాంత్ బాబు, త్రివిక్రమ్ రావును తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రిన్సిపాల్ వెళ్లకుండా అడ్డంగా పడుకుని బోధనేతర ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు సంజీవ్ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో సంజీవ్‌పై నుంచి ప్రిన్సిపల్ నర్సింహులు బయటకు వెళ్లిపోయారు. దీంతో ఆందోళన ఉధృతం చేస్తామని బోధన, బోధనేతర సిబ్బంది స్పష్టం చేశారు. కాగా, ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అని ప్రిన్సిపాల్ నరసింహులు కొట్టి పారేశారు.