నేటి సాక్షి, కరీంనగర్: ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కు నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మీడియాలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడు రామోజీ రావు అని సినీ పత్రికా రంగాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. లక్షలాది జీవితాల్లో వెలుగులు నింపి కానరాని లోకాలకు వెళ్లిపోయారని అన్నారు. ఈనాడు ద్వారా ఎన్నో సమాజ హిత కార్యక్రమాలు చేపట్టి ప్రజలను జాగృతం చేసిన ఘనత రామోజీరావుది అని కొనియాడారు. తెలుగు ప్రజలు గర్వించేలా హాలీవుడ్‌కు తీసిపోని విధంగా రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించడమే కాకుండా సినీ, టీవీ రంగాల్లో వినూత్న మార్పులు తీసుకొచ్చిన దార్శినికుడు రామోజీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి విక్టర్, కుర్ర పోచయ్య, మామిడి సత్యనారాయణ రెడ్డి, మెతుకు కాంతయ్య, ముక్క భాస్కర్, షబానా మహమ్మద్, జ్యోతి రెడ్డి, రజితా రెడ్డి, హసీనా, జిలకర రమేష్, లింగమూర్తి, శేహెన్ష, బషీర్, సతీష్ రావు, సుదర్శన్, ఆంజనేయులు, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.

