Monday, December 23, 2024

ఐఐటీ అడ్వాన్డ్స్​–2024లో అల్ఫోర్స్​ విజయకేతనం

నేటి సాక్షి, కరీంనగర్​: ఆదివారం ప్రకటించిన ఐఐటీ అడ్వాన్డ్స్​–2024 ఫలితాల్లో అల్ఫోర్స్​ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. వివిధ కేటగిరిల్లో జాతీయస్థాయి ర్యాంకులు సాధించారు. ఎం హర్షిత్ 64వ ర్యాంకు సాధించగా, జీ శ్రీహాస్ 290, బీ భరద్వాజ్ 396, ఆర్ పునీత్ మనోహర్ 477, సుబోద్ చౌదరి 545, ఏ శివవరుణ్ 557, పీ రాహుల్ 571, దేవదత్త 751, విశాల్ రెడ్డి 838, డీ రిశ్వంత్ కుమార్ 1029, పీ మనోహర్ 1229, నిహాల్ 1379, ఆదిత్యవర్ధన్ రావు 1523, లహరి 1609, అరుణ్ కుమార్ 1658, బీ అభినవ్ సిదార్ధ రెడ్డి 1851, సత్య అమూల్య 1933 ర్యాంకులు సాధించి, “అల్ఫోర్స్” ఖ్యాతిని మరింత ఇనుపడింపజేశారు. 1,000 లోపు 9 మంది విద్యార్థులు, 2,000 లోపు 17 మంది విద్యార్థులు, 5,000 లోపు 32 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడము విశేషం. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల ఆహర్నిష కృషి ఇంతటి ఘనవిజయానికి తోడ్పడ్డాయని విద్యా సంస్థల అధినేత వీ నరేందర్​రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం అల్ఫోర్స్ అందించిన ఐఐటీ కోచింగ్ ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీట్లు సాధించే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు. ఐఐటీ-2024 ఫలితాలకలె అద్భుత ర్యాంకులు సాధించిన అల్ఫోర్స్ ఆణిముత్యాలను, వారి తల్లిదండ్రులను మన:స్ఫూర్తిగా అభినందించారు. ఇంతటి ఘనవిజయానికి తోడ్పడిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News