- – గీతాభవన్ చౌరస్తాలో పటాకులు కాల్చిన బీజేపీ నాయకులు
- – ప్రమాణస్వీకారాన్ని ఎల్ఈడీ స్క్రీన్‌పై వీక్షించిన నేతలు
నేటి సాక్షి, కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించిన నేపథ్యంలో బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. డీజే పాటలు , బ్యాండ్ మేళాలు, నృత్యాలతో కరీంనగర్ పార్లమెంటు ఆవరణ సందడిగా మారింది. బండి సంజయ్ ప్రమాణస్వీకారం మహోత్సవాన్ని కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్‌లో బీజేపీ శ్రేణులు వీక్షించారు. అనంతరం గీత భవన్ చౌరస్తాలో భారీగా పటాకులు కాల్చారు. బీజేపీ నాయకుల కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ రాజకీయ ప్రస్థానం బీజేపీలో సామాన్య కార్యకర్తకు మార్గదర్శనం లాంటిదన్నారు. సామాన్య కార్యకర్తగా బీజేపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బండి సంజయ్ నేడు కేంద్ర మంత్రి స్థాయికి చేరుకోవడం సంతోషకరమన్నారు. ఇది బీజేపీలోనే సాధ్యమన్నారు. మోదీ 3.0 క్యాబినెట్లో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్‌కు అవకాశం కల్పించిన బీజేపీ జాతీయ, రాష్ట్రనాయకత్వానికి, ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా, ఇతర నాయకులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరామయ్య, నాగేశ్వర్ రెడ్డి, ఎర్రం మహేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బత్తుల లక్ష్మీనారాయణ, మాడ వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు కన్న కృష్ణ, వాసాల రమేష్, రాపర్తి ప్రసాద్, కోలగని శ్రీనివాస్, అనూప్, కాసర్ల ఆనంద్, జితేందర్, బొంతల కళ్యాణ్ చంద్ర, దుర్శెట్టి సంపత్, కటకం లోకేష్, రామానుజం, బల్బీర్ సింగ్, చొప్పరి జయశ్రీ, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, సత్యనారాయణ రెడ్డి, నాగసముద్రం ప్రవీణ్, మహేశ్, ఉప్పరపల్లి శ్రీనివాస్, బండ రమణారెడ్డి, తోట అనిల్ , సంపత్, మహేష్, రాము, శ్రీకాంత్ , చాడ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.