- – వసతులు కల్పించకపోతే వేలం పాటను అడ్డుకుంటాం..
- – సీపీఐ గన్నేరువరం నాయకుల హెచ్చరిక
నేటి సాక్షి, గన్నేరువరం: గన్నేరువరం మండలంలో ఈ నెల 12 న నిర్వహించే వారసంత, షాపింగ్, కంప్లెక్స్ వేలం పాటను అడ్డుకుంటామని సీపీఐ నాయకులు హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాటి వసతులు లేకుండా నిర్వహించే వేలం పాటను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీసం మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి సులభ్ కాంప్లెక్స్‌తో పాటు వారసంతలో కనీసం వసతులు కూడా లేకపోవడంతో వ్యాపార నిర్వాహకులు, మహిళలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. వేలం ద్వారా వచ్చే డబ్బులు మీద ఉన్న శ్రద్ద కనీస వసతులు కల్పించడంలో అధికారులు ప్రజాప్రతినిధులు విఫలం అయ్యారన్నారు. ఇప్పటికైనా అన్నివసతులు కల్పించి వేలం పాట వేయాలని, లేనిపక్షంలో వేలంపాటను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కాంతలా అంజిరెడ్డి, సహాయ కార్యదర్శి చొక్కాల శ్రీశైలం, మండల నాయకులు బోయిని మల్లయ్య, ఘర్షకుర్తి శ్రీనివాస్, నయీమ్, భాస్కర్, గోపయ్య తదితరులు పాల్గొన్నారు.