
నేటి సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ సిటీ మైనార్టీ సెల్ చైర్మన్ హైమద్ అలీ ఆధ్వర్యంలో మానకొండూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ కమిటీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పీసీసీ కార్యవర్గ సభ్యులు వైద్యుల అంజన్‌కుమార్, రహమత్ హుస్సేన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజీ తదితరులు హాజరై కేక్ కట్ చేసి, పంచిపెట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కవ్వంపల్లి సత్యనారాయణ అటు ఎమ్మెల్యేగా.. ఇటు డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నెరవేర్చుతూ సమర్థుడైన నాయకుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు. జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలిచినారని, కవ్వంపల్లి సారథ్యంలో జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు గెలుపొందడం సంతోషకరమని చెప్పారు. వైద్య వృత్తితో పాటు రాజకీయాలను సమానంగా చూస్తూ రెండు విధాలుగా ప్రజలకు సేవ చేస్తున్న కవంపల్లి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇమ్రాన్ షాహిద్ కొండ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

