- ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 60 మంది మైనర్లు.
నేటి సాక్షి కరీంనగర్ : కరీంనగర్ లో బుధవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో దాదాపు 60 మంది మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడ్డారని టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. పట్టుబడిన మైనర్లనుండి వాహనాలు స్వాధీన పరుచుకున్నామని గురువారం నాడు వారి తల్లిదండ్రులని పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించామని తెలిపారు. మైనర్లు ట్రాఫిక్ నియమాలపై సరైన అవగాహనా లేకుండా డ్రైవింగ్ చేయడం కలిగే అనర్దాలను వారికి వివరించామన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిగురించి ఉదహరించారు. పట్టుబడ్డ వాహనాలకు జరిమానాలు విధించి విడిచిపెడుతున్నామని , మరొక సారి పట్టుబడితే మైనర్లకు వాహనాలిచ్చే యజమానులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారుఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ తో పాటు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఖరీముల్లా ఖాన్ , స్వామి , ఎస్సైలు ఇషాక్ , శనిగల శ్రీకాంత్ లతో పాటు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.