నేటి సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ ఎస్సార్ డిజి స్కూల్లో అంతర్జాతీయ ఫాదర్స్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిల్లలకు పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల పూజ్య భావం కలిగేలా ఈవెంట్ జరిపారు. ఈ సందర్భంగా జోనల్ ఇన్చార్జి శశిధర్ మాట్లాడుతూ తండ్రి యొక్క ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరించారు. వేడుకల్లో పాల్గొన్న ఫాదర్స్‌కు వారి పిల్లలచేత శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల తండ్రులకు పోటీలు నిర్వహించి, బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మానస, ప్రైమరీ ఇన్చార్జి లావణ్య, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.