నేటి సాక్షి,గన్నేరువరం: మండల కేంద్రంలోని శ్రీ కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి బోనాన్ని ఎత్తుకొని మహిళలు ఆలయానికి బయలుదేరారు.అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలు యువకుల కేరింతలు డప్పు చప్పుల మధ్య ఘనంగా ఊరేగించారు. మహిళలు, పెద్దలు, చిన్నారులు ఆలయానికి చేరుకొని వర్షాలు బాగా కురవాలని పాడిపంటలతో ఇంటిల్లిపాలిది సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ సంఘం నాయకులు, సభ్యులు , మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

