Monday, December 23, 2024

కలెక్టరేట్​లో గ్రంథాలయం ప్రారంభం

నేటి సాక్షి, కరీనగర్​: కరీంనగర్​లోని కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ పక్కన ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయంలో వివిధ రకాల పుస్తకాలు న్యూస్ పేపర్లు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. కలెక్టరేట్, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలు గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మికిరణ్, డీఆర్ఓ పవన్ కుమార్, కలెక్టరేట్ ఏవో సుధాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News