Monday, December 23, 2024

ఆ తర్వాతే హరీశ్​రావు రాజీనామా గురించి మాట్లాడండి..

  • – మొదట 6 గ్యారంటీలు, 13 హామీలు అమలు చేయండి
  • – బీఆర్​ఎస్​ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి

నేటి సాక్షి, తొగుట: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారంటీలతో పాటు 13 హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు. రుణమాఫీతో పాటు 6 గ్యారంటీల్లో పేర్కొన్న 13 హామీలు అమలు చేస్తేనే మాజీ మంత్రి హరీశ్​రావు రాజీనామా చేస్తానని పేర్కొన్నారని చెప్పినట్టు చెప్పారు. దానికి కాంగ్రెస్ నాయకులు హరీశ్​రావు రాజీనామా చేయాలని పేర్కొనే ముందు ఆయన కోరినట్లు 6 గ్యారంటీలు అమలు చేసి మాట్లాడాలన్నారు. ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను ఆటకెక్కించారన్నారు. పెన్షన్​ పెంచుతామని చెప్పి, ఉన్న పెన్షన్​లో నెల కోత పెట్టారని వాపోయారు. కల్యాణలక్ష్మీలో తులం బంగారం, లక్ష ఇస్తామని చెప్పి, లక్ష కూడా ఇవ్వడం లేదన్నారు. రైతుబంధు స్థానంలో రైతు భరోసా ద్వారా ఎకరాకు రూ.15వేలు కౌలు రైతులకు, కూలీలకు రూ.12 వేలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు. ఉన్న రైతుబంధు కూడా యాసంగి మొదట్లో ఇవ్వాల్సింది.. పంట చివర ఇచ్చారని చెప్పారు. వానకాలంలో ఇంత వరకు ఇవ్వలేదని, కమిటీల పేరున కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. మహాలక్ష్మిలో 18 ఏండ్లు నిండిన వారికి రూ.2500 పెన్షన్​, నిరుద్యోగులకు రూ.2500 నిరుద్యోగ భృతి ఏమైందని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్​కు ఒక్క ఎంపీ సీటు రాలేదని చిందులు వేస్తున్న కాంగ్రెస్ నాయకులు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా 9 సీట్లు ఇతర పార్టీలకు వెళ్లిన విషయం మరువవద్దని సూచించారు. ఇది ప్రభుత్వానికి రెఫరెండం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ మల్లన్నసాగర్ నిర్మించి ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు అందించి సస్యశ్యామలం చేశారని, నేడు మల్లన్నసాగర్​ను ఎండబెడుతున్నారన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు, రైతుబీమా ద్వారా ఆర్థిక సాయం, రైతుబంధు ద్వారా పెట్టుబడి సహాయం అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News