Monday, December 23, 2024

అల్ఫోర్స్ ‘అడ్వాన్డ్స్​’ ప్రతిభ

– ఇంటర్​ అడ్వాన్డ్స్​ ఫలితాల్లో ప్రభంజనం

నేటి సాక్షి, కరీంనగర్​: సోమవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత మార్కులతో అఖండ విజయం సాధించారు. బైపీసీ విభాగంలో జే అంజన 440 మార్కులకు 439 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎంపీసీ విభాగంలో 30 మంది విద్యార్థులు 470 మార్కులకు 468 మార్కులతో చారిత్రాత్మక విజయం సాధించారు. ఇంతేకాకుండా 81 మంది విద్యార్థులు 467 మార్కులు, 131 మంది విద్యార్థులు 466 మార్కులతో సంచలనం సృష్టించారు. అనేక మంది విద్యార్థులు 465 మార్కులు సాధించడం విశేషం. బైపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించడంతో పాటు నలుగురు విద్యార్థులు 438 మార్కులు, 14 మంది విద్యార్థులు 437 మార్కులు, 34 మంది విద్యార్థులు 436 మార్కులు సాధించారు. ఎంఈసీ విభాగంలో టీ అఖిల్, వీ రిషిత, ఎం శ్రీవళ్లికా పటేల్ 500 మార్కులకు 494 మార్కులు సాధించి రాష్ట్రంలో అత్యుత్తమ స్థానంలో నిలిచారు. సీఈసీ విభాగంలో బీ గ్రీష్మ, సీహెచ్ నిఖిత 500 మార్కులకు 494 మార్కులు సాధించి రాష్ట్రంలో అత్యుత్తమ స్థానంలో నిలిచారు. అన్ని విభాగాల్లో అత్యద్భుత ఫలితాలు సాధించడం అల్ఫోర్కు మాత్రమే సాధ్యమని ఆ విద్యా సంస్థల చైర్మన్​ వీ నరేందర్​రెడ్డి తెలిపారు. పటిష్ట ప్రణాళికాతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అహర్నిశల కృషితో ఇంతటి ఘనవిజయం సాధ్యమైందని చెప్పారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సష్టమెంటరీ ఫలితాల్లో అద్భుత మార్కులు సాధించిన తమ అల్ఫోర్స్ ఆణిముత్యాలు, వారి తల్లిదండ్రులను మన స్ఫూర్తిగా అభినందిస్తున్నామని, ఇంతటి విజయానికి తోడ్పడిన అల్ఫోర్స్ అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News