- – కరాటేలో బంగారు పతకాలు సాధించిన ఈ–టెక్నో స్కూల్ స్టూడెంట్స్
నేటి సాక్షి, కరీంనగర్: జాతీయస్థాయి కరాటే పోటీల్లో అల్ఫోర్స్ ఈ-టెక్నో స్కూల్ విద్యార్థులకు బంగారు పతకాలు సాధించారు. మంగళవారం కొత్తపల్లిలో సదరు విద్యార్థులను అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వీ నరేందర్రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడారు. కరాటే ఆత్మరక్షణ క్రీడగా ఖ్యాతి గడించిందని, ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు పొందిందని చెప్పారు. తమ పాఠశాలకు చెందిన ఇద్దరు బంగారు పతకాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. క్రీడల్లో ఎన్నో విషయాలు నేర్చుకునేవి ఉంటాయని, ప్రత్యేకంగా విజయాలను సాధించే విధానాలను తెలుసుకుంటామని చెప్పారు. క్రీడల ద్వారా కలిగే విశిష్ట లాభాలవలన పాఠశాల విద్యా ప్రణాళికలో భాగంగా విద్యార్థులను వివిధ పోటలకు ఎంపిక చేయడమే కాకుండా అందులో విజయాన్ని సునాయాసంగా అందుకోవడానికై ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని చెప్పారు. ప్రాథమికంగా విద్యార్థులకు పాఠశాలలో ఎంపిక పరీక్ష నిర్వహిస్తామని అందులో ప్రతిభను కనబరచిన వారికి పోటీలకు ఎంపిక చేస్తామని వారు చెప్పారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో (జూన్ 9) కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే మరియు కుంగ్ఫూ చాంపియన్షిప్ పోటీలలో పాఠశాలకు చెందినటువంటి ఎ.రితిక, 5వ తరగతి, అండర్ 12, కటా విభాగంలో బంగారు పతకం, వెపన్ విభాగంలో రజత పతకం సాధించినదని చెప్పారు. అదేవిధంగా ఎ. సిరిసహస్ర, 8వ తరగతి, అండర్ 14 బాలికల విభాగంలో, వెపన్ అంశంలో కాంస్య పతకం మరియు కటా విభాగంలో బంగారు పతకం సాధించడం కరీంనగర్ జిల్లాకే గర్వకరాణమని మరియు ఇతర క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తి అని చెప్పారు. బంగారు పతకాలు సాధించడంపట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ విజేతలకు పుష్పగుచ్చాలతో పాటు ప్రశంస పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.