నేటి సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధి ఆర్మ్డ్ రిజర్వులో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మేకల శ్రీనివాస్(51) గురువారం విధుల్లో ఉండగా గుండెపోటుకు గురై మృతి చెందారు. విధుల్లో ఉండగా ఆయన అస్వస్థతకు గురి కాగా, తోటి సిబ్బంది అతనిని వెంటనే దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. 1995లో శ్రీనివాస్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. అంత్యక్రియల కోసం ఆయన భౌతికకాయాన్ని వారి స్వగ్రామం ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లికి తరలించి, అధికారిక లాంఛనాలతో జరిపించారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. అంత్యక్రియల్లో అడిషనల్ డీసీపీ (ఏఆర్) అనోక్ జైన్ పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అంత్యక్రియలకు రూ.20వేలను అందజేశారు. వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంమంలో రిజర్వు ఇన్స్పెక్టర్ (అడ్మిన్ ) మోడెం సురేష్, ఆర్ఎస్సై సురేష్‌తో పాటు ఇతర అధికారులు ఫ్యునెరల్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.