నేటి సాక్షి, వాంకిడి: వాంకిడి కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహ రావు జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ సేవలను పలువురు వక్తలు కొనియాడారు. ఒక న్యాయవాది, భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పీవీ పని చేశారని చెప్పారు. ఆయన బహుభాషావేత్త, రచయిత కూడా అని పేర్కొన్నారు.
ఈ పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు అని కొనియాడారు. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తేవడంతో పాటు కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను ఆయన సొంతం అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జామల్పూరి సుధాకర్, ఎంపీటీసీ జైరాం, టౌన్ అధ్యక్షుడు అనిల్, యువజన అధ్యక్షుడు దుర్గం ప్రశాంత్, ఓబీసీ సెల్ అధ్యక్షుడు గణేష్, పత్రు, విజయ్ కుమార్, కోభ్రగాడే విలాస్, మెంగజీ, దాదాజీ, సమేల రమేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.