Sunday, December 22, 2024

చెస్​లో అద్విత విద్యార్థికి మూడో ర్యాంకు

నేటి సాక్షి, కరీంనగర్​: ఇటీవల ప్రముఖ జీనియస్ చెస్ అకాడమీ వారు నిర్వహించిన జిల్లాస్థాయి చెస్ పోటీల్లో స్థానిక భగత్​నగర్​లోని అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ఎస్ శ్రావిక్ మూడో ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో సదరు విద్యార్థిని స్కూల్ డైరెక్టర్ సౌగాని అనుదీప్ అభినందించారు. శ్రావిక్​ రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో విజయం సాధించి, కరీంనగర్​కు, తెలంగాణకు, దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.

తమ పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించేలా తమవంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News