– ఎన్హెచ్ఎం (ఏఐటీయూసీ) రాష్ర్ట ప్రధాన కార్యదర్శి
నేటి సాక్షి, జనగామ: జాతీయ ఆరోగ్య మిషన్‌లో పని చేస్తున్న ఉద్యోగులను క్రమబద్దీకరించి, వారి సమస్యలు పరిష్కరించాలని జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా అన్నారు. జనగామ పట్టణంలోని గబ్బెట గోపాల్‌రెడ్డి భవనంలో సీపీఐ కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు జ్యోతి ఆధ్వర్యంలో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ రాజేష్ ఖన్నా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
జాతీయ ఆరోగ్య మిషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, లేదా హెచ్ఆర్డీఏ పాలసీ ఇవ్వాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రతి ఉద్యోగికి సంవత్సరానికి 35 క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన లీవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కందిక చెన్నకేశవులు పాల్గొన్నారు.
అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ (ఏఐటీయూసీ) జనగాం జిల్లా అధ్యక్షురాలిగా గంగరబోయిన జ్యోతి, ఉప అధ్యక్షురాలుగా ఓరుగంటి సమ్మక్క, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎలిమినేటి గణేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పారు నాంది లిఖిత రాణి, ఉప అధ్యక్షురాలుగా ఏదునూరి పద్మ ,ఉపాధ్యక్షుడుగా బానోతు భాస్కర్, కోశాధికారిగా చెన్నూరి మల్లేశం ,జాయింట్ సెక్రటరీలుగా జేరిపోతుల ప్రియాంక, తీర్చి రజిని, చీఫ్ అడ్వైజర్ పనికెల సౌజన్య, ఈసీ మెంబర్స్‌గా డాక్టర్ బగడం భార్గవి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొండ్ర లత, ఈసీ సభ్యులుగా చిలుకమారి అంజయ్య, మరిపెల్లి కవిత తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.