Monday, January 19, 2026

What People like : ప్రజలకు ‘నచ్చినవి’! విలన్లకు ‘నొచ్చినవి’!!

‘నేటి సాక్షి’ దినపత్రిక అనతికాలంలోనే ప్రజల గుండెలకు చేరింది. అనూహ్యంగా జనాల్లోకి చొచ్చుకెళ్లింది. ఎంతలా అంటే మంచం మీద నుంచి ‘లేచీ లేవక ముందే’ మొబైల్ ఓపెన్ చేసి ‘ఆన్​లైన్’లో ‘నేటిసాక్షి’ని వెతికేంత.! ఇవాళ.. ఏం రాశారని.. ఎవరి బంఢారం బయట పెట్టారన్న ఆసక్తితో.! అతిశయోక్తి కాదు గానీ.. కాస్త ఆలస్యమైతే.. అయ్యో ఇంకా పేపర్ ఆన్​లైన్​లో పెట్టలేదా? ఏంటీ ఏంటీ ఈరోజు స్పెషల్? అని ఫోన్ చేసి అడిగేంత! ఒకవేళ ఏమీ లేదు అని చెప్పి నిరాశ పరుచుడెందుకనీ.. ‘స్పెషల్ ఎడిషన్’లు తీసేలా ప్రేరణ కలిగిస్తున్నారు!

రామాయణం చదువుతుంటే ‘పిడకల వేట’ ఎందుకు? గమ్యాన్ని ఆటంకపరిచేందుకన్నట్టుంది. అయితే! ‘నేటి సాక్షి’లో ఈ కొద్ది సమయంలోనే ప్రచూరించబడ్డ మా ఆసక్తికర కథనాలు కొందరు విలన్లకు ‘నొచ్చేలా’ చేస్తే.. చాలామంది పాఠకులకు ‘నచ్చేలా’ చేశాయని గర్వంగా ఫీలవతున్నాం! ‘గజరాజు దర్జాగా వెళుతోంటే.. కుక్కలు ఎన్నో వెంటపడి మొరుగుతుంటాయి’. వేటి పని వాటిదే! ఇంత వరకు వచ్చినవి జస్ట్.. ‘ప్రోమో’లు మాత్రమే! ముందున్నది ముసళ్ల పండుగ..

‘పిడకల’వేట కథ కాదు ‘పీడకలలు’ వచ్చే కథనాలే మున్ముందు అందించబోతున్నామని ధైర్యంగా చెబుతున్నాం! వాటిని ‘వన్ బై వన్’గా మా అభిమాన ‘నేటి సాక్షి’ పాఠకుల కోసం సమయం.. సందర్భం.. చూసుకుంటూ ‘రుచికరమైన’ విందు భోజనం లాంటి మరింత ఆసక్తికరమైన కథనాలు అందించేందుకు ‘వంట రెడీ’ చేస్తున్నాం! సిద్ధంగా ఉండండి.. ‘టీ’లు, ‘టిఫిన్’లు.. ‘లంచ్’లు.. ‘స్నాక్’లు.. ‘డిన్నర్’లు.. ‘దావత్’లు.. ‘బిర్యానీ’లు.. ‘జ్యూస్’లు.. ‘కాయ్-పాయ్’లన్నీ రెడీ చేస్తున్నాం!!

సదా.. మా ప్రియ పాఠకులను కోరేదొకటే.. మేం అహర్నిశలూ కష్టపడి సేకరించి, మీకు రుచికరమైన వంటకాన్ని అందించిన కథనాలను ‘బ్లూ కలర్’ లింక్​ను ఓపెన్ చేసి చూస్తే క్లారిటీగా చదవగలరు.! అదే క్లిప్ ఫొటోను చదివితే.. మీకే చదవడానికి తృప్తిగా ఉండదు.. ‘క్లిక్’ చేయండి.. ‘షేర్’ చేయండి! మీ ఆదరాభిమానులకు ఎల్లవేళలా కృతజ్ఞులమై ఉంటాం!
– నేటి సాక్షి యాజమాన్యం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News