‘లంకేశ్వరుడు’ ఎత్తుకెళ్లిన ‘సీతమ్మ’ను వెతకడానికి లంక లోకి వచ్చిన ‘వాయుపుత్రుడి’ని వాడి మానాన వాడిని వదిలేస్తే వెతుక్కుని వెళ్లిపోవును గదా? ‘రాకాసి విలన్లు’ రెచ్చగొట్టి ‘వాయు పుత్రుడి’ తోకకు నిప్పంటిస్తే ఏం జరిగింది? రెచ్చగొట్టిన వారి కొంపలన్నింటికీ ‘నిప్పంటించేశాడు’ అని పురాణాల్లో ఓ ఇంట్రెస్టింగ్ ముచ్చట! సరిగ్గా ఈ ‘పురాణ గాధ’ల్లో లాంటి సన్ని‘వేషాలు’ .. ప్రస్తుతం ‘నేటి సాక్షి’.. ప్రయాణంలో ఎదురవుతున్నాయి.!
కుమిలిపోతున్న ‘ఫస్ట్ ఎస్టేట్’
సమాజమనే ఇంటిని నాలుగు స్తంభాలై నిలబెట్టే ‘పబ్లిక్.. పొలిటికల్.. పోలీస్.. ప్రెస్’ అనే ఈ నాలుగు స్తంభాల్లో మూడు స్తంభాలు పరస్పరం ‘మకిలి’అంటించుకుని మలినపడ్డాయని మొదటి స్తంభం కుమిలిపోతోంది.! ఇంకా అక్కడక్కడా ‘మకిలీ’ అంటించుకోని ‘ఇటుకలు’ సమాజ పునర్నిర్మాణానికి పూనుకుంటే ఇవేవీ ఇష్టం లేని ‘ఆ-మూడు ఎస్టేట్-కింగ్ మేకర్లు’ అడుగడుగునా ఊహించిన ‘కుట్ర’లు పన్నుతూనే ఉన్నారు.!
‘కింగ్ మేకర్’ను అడ్డం పెట్టుకొని..
ఆడెవడో అన్నట్టు ‘రొండు రూపాయల పెన్ను-రొండు వందల ఐడీ కార్డు’ జేబులో పెట్టుకున్న ప్రతోడు పాత్రికేయుడేనా? అని.. ‘భార్య’ పదవిని అనుభవిస్తున్న ‘భర్త’అనే ఓ పొలిటీషియన్ మాట ప్రకారం చేతకానోళ్లంత ఒక్కొక్కరొక్కరు ‘ప్రెస్ ఫీల్డ్’కొస్తే ఇదిగో ఇలాంటి ‘చిల్లర మాటలే’ ఎదురవుతాయి. ఇలా ఒక్కరొక్కరూ చేరి ‘కాపీ పేస్ట్’లైపోతే ‘శాంతి కపోతాల’ ఇళ్లలో బోళ్లు తోమడానికి తప్ప దేనికీ పనికిరారు. ఇలా వెన్నెముక లేని వాళ్లందరూ ఎక్కడికక్కడ దొరికినకాడ బరుకుదామని వస్తే.. ఏదో చోట ఇరుక్కుపోయి రక్షింపబడితే.. రక్షించినోడే ‘కింగ్ మేకర్’. అప్పటినుంచి వీళ్లంతా ‘కట్టప్ప’లే.! ఇక్కడే ఓ రెండు ట్విస్ట్‌లు ఉంటాయి. ఒకటి.. కింగ్‌మేకర్‌ను అడ్డంపెట్టుకుని ‘బరుక్కునే’వాళ్లు. రెండు.. ఈ ‘బుడబుక్కలోల్లు’ పోయి ‘కింగ్‌మేకర్’కు చెప్పమంటారా? అని అడిగి ‘బద్నాం’చేసేటోళ్లు.!
మొదటోడు..చెట్టు పేరు చెప్పి, కాయలు అమ్ముకుని పబ్బం గడుపుకునేటోడు. రెండోవాడు.. అదే చెట్టు పేరు చెప్పి బరుకుదామనుకుంటడు.. దొరికితే పడ్తల్ వడ్తది.. లేదంటే ‘కింగ్‌మేకర్’ను బద్నాం చేసేసుడన్నట్టు. ఇలా ప్రతీ ఇష్యూ భరించలేక సదరు ‘కింగ్‌మేకర్’కు లేనిపోని ‘తలనొప్పులు’ మోపైనట్టు బాహాటంగానే వినిపిస్తున్న ముచ్చట్లు.
అలర్ట్ చేయనేలా? అవమానపడనేలా!?
అడుసు తొక్కనేలా? కాలు కడుగనేలా? అన్నట్టు.. నిద్రాణ స్థితిలో.. కాదు కాదు.. కోమాలో ఉండిపోయిన ‘కొన్ని పెన్నుల్లో’నైనా సిరానింపే యత్నం చేసింది ‘నేటి సాక్షి’. కానీ.. ‘ఆ-పెన్నులు’ కూడా ‘రిమోట్ కంట్రోలర్’ జేబులో సేదదీరేవని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక సమాజ శ్రేయస్సు కోసం పాటుపడేదెలా? ఆ ‘రిమోట్ కంట్రోలర్’ జేబులో 70-80 పెన్నులంటే ఆశ్చర్యకరం. అయినా.. ఆ పెన్నులకూ ఉండాలి!
రియల్-కబ్జాదారుల జబర్దస్తీ
‘మందు-విందు-పొందు-పథకం’ కింద లబ్ధిదారులైన సదరు వెన్నెముక లేని ‘కాపీ పేస్ట్’ కలంధీరులనుద్దేశించి ఓ ‘భార్యాపదవిని అనుభవిస్తున్న శాంతి కపోతం’ ఏమంటదటంటే.? అరె.. ఎవడ్రా.? మనల్ని ఆపేది.? ఆ ముగ్గురు నలుగుర్నీ కమ్మేస్తే.. అంతా వాళ్లే చూసుకుంటరు.. అయినా ‘కుక్క బిస్కెట్’గాళ్లు మనదాకా వచ్చేంత ధైర్యమా.? ఏదీ.? రమ్మను.! ఏం.. హీక్కుంటారో.. హీక్కోని చూద్దాం.!! అని దర్జాగా ‘ప్రభుత్వ భూముల కబ్జా’లు చేసిన సదరు ‘శాంతి కపోతం’ జబర్దస్తీ వార్నింగ్ మాటలివి.! ఇలా.. దాదాపు చాలా మంది ‘శాంతి కపోతాలు’వల్లించే వార్నింగ్‌లు ఇవే! ధైర్యం చేసినోడికి బెదిరింపులు.. నోటీసులు.. ఫిర్యాదులు.. ఎఫ్ఐఆర్లు.. ఐడీ-ఊడబీకేయించడాలు.. లేదా ‘సోషల్ మీడియా’లో బురదజల్లే ప్రయత్నాలు.. దీంతో వాడు ‘కట్టప్ప’గా మారిపోవుడే!
తెలుపు-నలుపు-చట్టాల్-పట్టాల్
మరీ.. మొండిగా ఎవడైనా ఆ కాంపౌండ్ లోకి వెళ్లనోడు ‘భూ-కబ్జా’లో.. వసూళ్ల ముచ్చట్లో.. తెరవెనుక బాగోతాలో చెవిలో పడినవో.. కంట్లో పడినవో.. రాసి జెండాకెక్కిస్తే ‘వాడికి-పెత్రమాస’కు పెట్టుకునుడే.! తొలుత ‘తెలుపు’ ముఖం ‘ఎరుపు’అవుద్ది.. ‘నలుపు’ ఎంటరవుద్ది.. లూప్హోళ్లు వెదికి ఓ రెండు మూడు సలహాలు సూచనలు పారే.. ‘చట్టాల్’-పట్టాలేసుకుని కటకటాలు లెక్కెట్టుకోమని హుకూం జారీ చేస్తారు.! ఫైనల్‌గా మూసుకుని ఉండుడో.. తట్టాబుట్టా సదురుకుని నడుసుడడో గంతే..ఇగ.!
బానిస మేతావుల చేతికి బురదజల్లే పని
పరాన్న జీవులుగా ముద్రపడ్డ కొందరు ‘మేతావుల’ను చేరదీసి ‘రాసుగుర్రాల’పై బురదజల్లే పని అప్పగిస్తారు. అంగ బలం.. అర్థ బలం.. గుండె బలం లేనోడు ఏ దిక్కుకు పోవాలో తెలీక బిక్కచచ్చి.. బక్కచిక్కి.. కంపల్సరీ కాంపౌండ్ బాట పట్టేందుకు పరుగులు తీసేలా ‘సోషల్ మీడియా’లో మెసేజ్‌ల వరద సృష్టించి బెంబేలెత్తిస్తారు.!
– వకాల్తా గురూజీ చెప్పిన కొన్ని మంచిమాటలు👌
- సమాచారం అనేది హానికరమైనప్పుడు ప్రజల్లో మీడియాపై వ్యతిరేకభావం పెంచే అవకాశం ఉంది.
- రాజకీయ నాయకుల మాటలు నమ్మి, వార్తలు రాస్తే నష్టపోయేది పత్రికా సమాజమే.
- ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు గమనిస్తే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనే నానుడిని నిజం చేస్తున్నాయి.
- మారిన చట్టాలు కఠినంగా ఉన్నాయి. వాటిపై అవగాహన పెంచుకుని వార్తలు అందించండి.
- వార్త రాయుమని చెప్పేవారి దగ్గరి నుంచి కచ్చితంగా వారే వార్తను ఎవరి ఒత్తిడికి లోనుకాకుండా ప్రకటిస్తున్నట్టుగా ధ్రువీకరణ పత్రం తీసుకోండి.
ఆ-వాస్తవాలకు ‘రంగు పడింది’
- నకిలీ వార్తలు రాయడం.. బ్లాక్ మెయిల్ చేయడం?
- తద్వారా ప్రకటనల ఆదాయం సంపాదించడం?
- అనుకూలంగా లేని ఏ వ్యక్తినైనా టార్గెట్ చేస్తూ వారిపై తప్పుడు వార్తలను ప్రచారం చేయడం?
- బాధితురాలి మామ ఎవరు?
- ఆ మామ మీద ఒత్తిడి తెచ్చిన విలేకరి ఎవరు?
- విలేకరి ‘ఫోన్ పే’కు కొట్టిందెవరు?
- ఆ ఫోన్ పే కొట్టించుకున్న విలేకరి ఎవరు?
- ఇంతకూ ఆ నేరారోపణ ఎదుర్కొంటున్న కౌన్సిలర్లు ఎవరై ఉంటారని ప్రజల్లో మరింత ఆసక్తి రేకెత్తించినట్టైంది.!
కాపీ-పేస్ట్ గాళ్లకు కళ్లు తెరిపించే ముచ్చట
ప్రముఖ సినీ దర్శకులు ‘వేణు ఉడుగుల’ చెప్పినట్టు.. ‘తనకంటూ ఏ లక్ష్యం లేనోడు-ఏదోక లక్ష్యం పెట్టుకున్నోడికి పనిచేయాల్సి ఉంటుందంటాడు’! సరిగ్గా.. ఇప్పుడు పనిచేస్తున్న 70-80 మంది కూడా ఏ లక్ష్యం లేకుండా వచ్చి.. ఏదోక లక్ష్యం ఉన్నోళ్లకు బానిసలుగా పనిచేస్తున్నారని చెప్పకతప్పదు.! ‘ఫస్ట్ కాపీ పేస్ట్’ వార్తలు రాయకుండా.. రాసి పొద్దుపొద్దున్నే తాము రాసిన వాటిని కుప్పలు కుప్పలుగా ఏడ నుంచి ఎత్తుకొచ్చిండ్రో ఆడనే పారబోయడం ఆపితే.. మీకంటూ ఓ విలువ ఉంటుంది.! లేకపోతే.. తెలిసీ తెలియని.. సగంసగం సమాచారం వార్తలుగా రాస్తే.. కొత్తగా వచ్చిన మారిన చట్టాలు మన పీక పిసకనున్నాయట.. ‘ఎవరు వార్త రాయుమంటారో ‘ధ్రువీకరణ పత్రం’ ఇచ్చి రాయించుకోమనండి’.. లేదా కటకటాలు లెక్కెట్టుకోమని కొందరు ‘తువ్వాలులో చెప్పెట్టి వార్నింగ్’లు ఇచ్చేశారు. ఇక్కడ ‘ఎవడి సినిమాలో-వాడే హీరో’.. ఎవడికి ఎవడు బానిసాకాదు.. ఛత్రపతీ అంతకన్నా కాదు.! దమ్ముంటే రాయండి.. లేదంటే సచ్చేదాకా బానిసలుగానే బతకండి.. కానీ, పాత్రికేయ విలువలకు పాతరేయకండి.!!

