నేటి సాక్షి, జమ్మికుంట (మోరె ప్రశాంత్): తన వార్డు ప్రజలు బాగుంటేనే తాను బాగుంటానని జమ్మికుంట ఆరో వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేశ్ అన్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీలోని కాలువలు నిండిపోగా, మరికొన్ని చెత్తాచెదారంతో నిండిపోయాయి. ఆదివారం ఉదయం 6గంటల నుంచి ఆయన మున్సిపల్ సిబ్బందితో కలిసి కాలువలను క్లీన్ చేయించారు. వరద నీరు సాఫీగా వెళ్లేలా చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరెంటు స్థంబాల దగ్గర ఉండొద్దని, తీగలను ఎట్టి పరిస్థితిలో పట్టుకోవడం గానీ, ముట్టుకోవడం చేయొద్దని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని పేర్కొన్నారు.