నేటి సాక్షి ప్రతినిధి, బెజ్జంకి:
బెజ్జంకి మండలంలోని పోతారం గ్రామంలో రీఓపెన్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సందర్శించి, అభినందించారు.
గత 15 సంవత్సరాల క్రితం మూతపడి పునరుద్ధరించిన సందర్భంగా గ్రామస్తులకు పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు, గ్రామపంచాయతీ మాజీ కార్యదర్శి జ్యోతిని, మల్టీపర్పస్ వర్కర్ బాబును పాఠశాల పునరుద్ధరణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనిచేసినందున కలెక్టర్ అభినందించడం జరిగింది.
పాఠశాల మౌనిక వస్తువుల కల్పనలో భాగంగా పాఠశాల మైనర్ రిపేర్లు, గేటు నిర్మాణం, నీటి వసతి, కరెంటు సదుపాయం కొరకు అంచనాలను తయారుచేసి పంపించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.
పిల్లలతో కాసేపు ముచ్చటించి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారితో పాటు పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి, డి ఈ మహేష్, సెక్యురల్ ఆఫీసర్లు రామస్వామి, రంగనాథ్ గారు, ఎంపీడీవో లక్ష్మప్ప, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి,ఎంపీ ఓ విష్ణు,MLO మహతి లక్ష్మి, పంచాయతీరాజ్ శాఖ ఏఈ సమ్మయ్య,, ఎలక్ట్రిసిటీ ఏఈ చాంద్ పాషా,గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి రేణుక, పాఠశాల ఉపాధ్యాయుడు రమేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఎంపీడబ్ల్యు బాబు, పిల్లల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.