Monday, December 23, 2024

కార్మిక సంక్షేమం.. ‘కృష్ణా’ర్పణం!

  • కొత్త ‘సోబగుల’ పేరుతో కోట్ల నిధులు వృథా
  • అవసరం లేకున్నా ‘సంక్షేమ నిధుల’ దుర్వినియోగం
  • డ్రైవర్లకూ ఖరీదైన సౌకర్యాల కల్పన
  • నిబంధనలకు విరుద్ధంగా కమీషన్ల కోసం పలు బ్యాంకుల్లో డిపాజిట్లు
  • 14 ఏండ్లుగా కుర్చీ వదలని సూపరింటెండెంట్
  • అడిగినోడు ‘అయ్యా-ఎస్’కు బలి
  • ఇదీ ‘కార్మిక శాఖ ముఠా మేస్త్రీ’ నిధుల గోల్​మాల్​ కథా కమామీషు

చెమ్చా’.. ఏ పాత్రలో ఉంచితే ఆ పాత్రలో ఉన్న ఆహారపదార్థాలను ఖాళీ చేస్తుందంటారు! సరిగ్గా అలానే.. ఓ ‘అయ్యా-ఎస్’.. ముఠా మేస్త్రీ ఆ శాఖలో తిష్టవేసి ‘పాత్రలోని ఆహారాన్నే కాదు.. ఆ పాత్రనే ఖతంబట్టిచ్చేట్టు తయారైందక్కడ! ఇదెక్కడో కాదు.. సాక్షాత్తు.. రాష్ట్ర రాజధానిలోని టంగుటూరి అంజయ్య కార్మిక కార్యలయంలో (రాష్ట్ర కార్యాలయంలో) జరుగుతోన్న నిధుల గోల్​మాల్ కథా కమామీషు ఇదీ.!

డ్రైవర్లకూ సకల సౌకర్యాల వెనుక ఏదో కథ
‘మింగే బుద్ధులు.. కొండయ్య కెరుకాన్నట్టు’.. కార్మిక సంక్షేమ నిధులు మింగేందుకు ఇంకొక అయ్యవారు మరో కుట్ర పన్నాడు. అధికారుల కార్లు నడిపే డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు కూడా విలాసవంతమైన రూమ్ కట్టించడానికి సిద్ధం అయ్యాడు. నిబంధనలకు విరుద్ధంగా కార్మిక సంక్షేమ మండలి డబ్బులు వృథా చేస్తున్న ఈయనపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్​లో సంక్షేమ బోర్డులో నిధులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

రాస్తే రామాయణం.. చెప్తే భారతం
ఎలాంటి స్థాన చలనం (ట్రాన్స్​ఫర్) లేకుండా 14 సంవత్సరాలుగా ఒకే స్థానంలో ఉన్నటువంటి సూపరింటెండెంట్​ అవినీతి అక్రమాలు పైన పేర్కొన్నవే కాకుండా రాస్తే రామాయణం.. చెప్తే భారతం.. అతని అవినీతికి హద్దు, అదుపు లేకుండా ఉందని ఆఫీసులో చిలువలు పలువలుగా చెప్పుకుంటారు. అనేక అక్రమాలు, అవినీతి కి పాల్పడుతున్న సూపరింటెండెంట్​పై విచారణ చేపట్టి చట్టరీత్యా చర్యలు తీసుకొని తనను వేరే శాఖకు బదిలీ చేసి సంక్షేమ బోర్డును కాపాడాలని పలువురు కోరుతున్నారు.
కార్మికుల ‘రక్తం’ తాగిన వైనం
కార్మికుల సంక్షేమం పక్కనబెడితే.. వారి కోసం ఏర్పాటు చేసిన నిధులనూ నొక్కేయడమే గాక.. ఏకంగా వారి ‘రక్తం’తాగేస్తూ కడుపునింపుకున్న కక్కుర్తి ‘అయ్యా-ఎస్’ బహుశా ఈయనే అయ్యుంటారని తెలిసిన వాళ్లు ఈసడించుకుంటున్నారు.
కార్మికుల రక్త పరీక్షల పేరుతో, స్కిల్ ట్రైనింగ్ పేరుతో వందల కోట్ల స్కామ్ చేసినట్టు కార్మిక శాఖలో ముచ్చటించుకుంటున్నారు‌. రక్త పరీక్షల్లోనూ భారీ లొసుగులున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా ‘అనామక’ ఏజెన్సీకి ఇచ్చి కమీషన్లు దండుకుంటున్నారని అధికారులే గుసగుసలు పెట్టుకుంటున్నారు. అభం శుభం తెలియని కార్మికుల సంక్షేమ నిధి అధికారుల పాలవుతోందని మొత్తుకుంటున్నారు.
సంక్షేమ బోర్డులో ఉన్న డబ్బులు కార్మికులకు ఉపయోగం లేని అనవసర.. పనికిరాని స్కీంలకు ఖర్చు చేసేందుకు ఉన్నతాధికారులు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి ఉన్నతాధికారులు.. డైరెక్టర్, సూపరింటెండెంట్​లదే కీలక పాత్రన్నది బహిరంగ రహస్యమే అయినా చర్యలు తీసుకునేవారు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించకపోవడం విచారకరం!

కృష్ణుడి కనుసన్నల్లోనే కథంతా..
ఇంత అవినీతికి పాల్పడిన కూడా సూపరింటెండెంట్ పేరు ప్రస్తుతం జరిగిన బదిలీల్లో కనీసం ప్రస్తావన లేదు. కనీసం లిస్ట్​లో కూడా లేదు. సహాయ కార్మిక అధికారుల, సీనియర్ అసిస్టెంట్ల బదిలీలు పారదర్శకంగా జరగలేదు. జరపలేదు కూడా.. లేబర్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య. కాబట్టి, కార్మిక శాఖలో పారదర్శకంగా జరగని బదిలీలు రద్దు చేయాలని, సూపరింటెండెంట్, కార్మిక డైరెక్టర్ గారిని తక్షణమే బదిలీ చేయగలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News