Monday, December 23, 2024

ఆషాఢం.. ఆహ్లాదం!!

ఆషాఢ మాసంలో ఆధ్యాత్మిక విశేషాలు ఎన్నో!

తొలి ఏకాదశి, గురు పౌర్ణమి వంటి పర్వాలు ఈ మాసంలోనే వస్తాయి. ఆషాఢ మాసం మొదలు నాలుగు నెలలను చాతుర్మాసాలని పిలుస్తుంటారు. ఈ కాలంలో చాతుర్మాస్య వ్రతం ఆచరించడం ఒక సంప్రదాయం. మనిషి జీవన విధానాన్ని గాడిలో పెట్టే సాధనం… చాతుర్మాస్య వ్రతం. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకూ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తుంటారు. కొందరు ఆషాఢ శుద్ధ ఏకాదశి (శయన ఏకాదశి) నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ పాటిస్తుంటారు.

కోక్కుల వంశీ నేత
(నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ)

చాతుర్మాస్య వ్రతాన్ని బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్న్యా సులు.. అందరూ ఆచరించే సంప్రదాయం ఉండేది. అయితే కాలక్రమంలో సన్న్యాసు లు, సనాతన ధర్మాన్ని నిష్ఠగా ఆచరించే కొద్ది మంది మాత్రమే పాటిస్తున్నారు. ఆషా ఢ మాసం నుంచి వర్షాలు మొదలవుతాయి. వాతావరణం ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయే లా ప్రేరేపిస్తుంటుంది. అలాంటి పరిస్థితుల ను ఎదుర్కొనే రక్షణ కవచమే చాతుర్మాస్య వ్రతం. దీనిని ఆచరించేవారు నాలుగు మా సాలు తానున్న ప్రదేశం పొలిమేర దాటకూ డదు. రెండో నియమం నాలుగు నెలలూ ఒకే పూట భోజనం చేయాలి. అది కూడా తానే స్వయంగా వండుకోవాలి. విస్తట్లోనే తినాలి. అన్నింటి కన్నా.. చేయదలచిన భోజనం ఒకే సారి విస్తట్లో వడ్డించుకోవాలి. అంటే మారు వడ్డన పనికిరాదు. ఈ నాలుగు నెలలూ మధ్యాహ్నం పూట నిద్రించకూడదు. రాత్రి కూడా రెండో జాము వరకు భగవన్నామ స్మరణ చేసి అప్పుడు పడుకోవాలి.

ఈ నియమాలన్నీ మనిషిని సన్మార్గం లో నడిపించడానికి దోహదం చేసే వే. మితాహారం ఆరోగ్య కారకం. ఇంద్రియ నిగ్రహం ఆధ్యాత్మిక పురోగతికి దోహదం చే స్తుంది. నాలుగు నెలలు ఈ నియమాలు పా టించడం ద్వారా.. ఆ తర్వాతి కాలంలోనూ మనో నిగ్రహంతో ఉండగలుగుతారనే ఉద్దేశంతోనే చాతుర్మాస్య వ్రతాన్ని సూచించారు మన పెద్దలు.

ఆషాఢమాసంలో చేయాల్సినవి
వర్షాకాలంతో పాటుగా ఆషాఢమాసం ప్రవేశిస్తుంది. ఆ ఆషాఢమాసంతో తనతో కొన్ని ఆచారాలనూ తీసుకువస్తుంది. అవన్నీ ఉత్త చాదస్తాలంటూ కొంతమంది కొట్టివే యవచ్చుగాక, ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవ చ్చుగాక! కానీ ఆషాఢంలో పాటించాలం టూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనకా ఓ కారణం కనిపిస్తుంది. కావాలంటే మీరే చూడండి…


పేలాల పిండి..
ఆషాఢంలో వచ్చే గాలి, నీటి మార్పులతో కఫసంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవ కాశం ఉందన్న విషయం తెలిసిందే! ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణ శక్తి కూడా మందగిస్తుంది. పేలాలు కఫాన్ని తగ్గిస్తాయి, జీర్ణశక్తికి మెరుగుపరుస్తాయి. వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లం, యాలుకలు శరీరంలో వేడిని పెంచుతాయి. అందుకే ఆషాఢంలో వచ్చే తొలిఏకాదశి రోజున తప్పకుండా పేలాలపిండి తినాలని చెబుతూ ఉంటారు.


మునగాకు..
మునగాకు ఒంటికి మంచిదని ఆయు ర్వేదం తేల్చింది. లేత మునగాకు తింటే కంటిసమస్యలన్నీ తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తూ ఉంటారు. కానీ మున గాకు చేదుగా ఉంటుంది. పైగా విపరీ తమైన వేడి. అలాంటి మునగాకుని తినేందు కే ఇదే అనువైన కాలం. లేత మునగాకు దొ రకాలన్నా, ఒంట్లో వేడి పెరిగినా ఫర్వా లేద నుకున్నా.. వర్షాకాలమే అనువైన సమయం. మునగాకుతో బయట ఉష్ణోగ్రతలకు అను వుగా ఒంట్లోని వేడినీ పెంచినట్లవు తుంది. అందులోని పోషకాలను నిర్భయంగా అందు కునే అవకాశమూ దక్కుతుంది.
దానాలు..
ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయనం, పి తృదేవతలకు ఇష్టమైన కాలంగా చెబుతుం టారు. కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయమని అం టారు. ముఖ్యంగా గొడుకు, చెప్పులు దానం చేయమని సూచిస్తూ ఉంటారు. వర్షాకాలం లో ఈ రెండు వస్తువులూ ఎంత అవసరమో చెప్పనవసరం లేదు కదా!
సముద్రస్నానాలు
ఆకామావై పేరుతో సముద్రస్నానానికి అ నువైన మాసాలలో ఒకటిగా ఆషాఢ మా సా న్ని పేర్కొంటారు. ఆషాఢం వరకూ సము ద్రపు ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుం ది. వర్షరుతువుతో పాటుగా అందులోకి కొత్త నీరు చేరుతుంది. ఆ నీరు ఉరకలు వేస్తూ స ముద్రంలోకి చేరే సమయంలో మొక్కలు, ఖనిజాలలో ఉన్న ఔషధగుణాలని తనతో పాటుగా తీసుకువస్తుంది. అలాంటి సము ద్రస్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది.
గోరింటాకు..
ఆషాఢంలో వర్షాలు ఊపందుకుంటాయ న్న విషయం తెలిసిందే! అలా తరచూ వర్షపు నీటిలో నానుతూ ఉంటారు. ఇక పొలం ప నులలో పాల్గొనేవారైతే రోజూ నీటిలో తడవ క తప్పదు. దాంతో గోళ్లు సందున నీరు చేరి చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. గోళ్లు కూడా పెళుసుబారిపోతాయి. ఇలాంటి సమ స్యలన్నింటినీ దూరం చేసే సత్తా గోరింటాకు కి ఉంది. పైగా గోరిటాకుని పెట్టుకోవడం వల్ల కఫసంబంధమైన దోషాలు కూడా తగ్గుతాయని పెద్దలు చెబుతుంటారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News