Monday, December 23, 2024

పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లు

నేటి సాక్షి, అందోల్​ : పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించడంపై దృష్టి పెట్టాలని మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్ చిట్టిబాబు సూచించారు. సోమవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని అందోల్ -జోగిపేట మున్సిపల్ పరిధిలోని 17 వ వార్డులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తూర్పు గౌని ముదిరాజ్ సంఘంలో ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, 17 వ వార్డు కౌన్సిలర్ చిట్టిబాబు హాజరై వార్డు ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా తమ ఇంటి పరిసరాలు, పొలాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంపై దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాదగిరి కటికే దేవేందర్, మహేష్, సాయి, అడ్డు, ఆరిఫ్, చరన్, శానిటేషన్ ఇన్​స్పెక్టర్​ వినయ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News