Monday, December 23, 2024

Runa Mafi: రేపే రెండో విడత రుణమాఫీ!

  • మాఫీ కానున్న రూ.1.50 లక్షలు
  • రైతులు, ప్రజా ప్రతినిధులు తరలిరావాలి
  • సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ రెండవ విడుత నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నదని సిరిసిల్ల కలెక్టర్ సందీప్​కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధుల, రైతుల, అధికారుల సమక్షంలో రెండో విడుత రుణమాఫీ రూ. 1.50 లక్షల కార్యక్రమం నిర్వహించనున్నామని పేర్కొన్నారు.

ఈ రుణమాఫీ కార్యక్రమంలో జిల్లాలోని రైతులు, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు వ్యవసాయ శాఖ సిబ్బంది, సహకార శాఖ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. రుణమాఫీ లబ్ధిదారులైన రైతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News