నేటి సాక్షి, కొమురంభీం ఆసిఫాబాద్: ఎస్పీ డీవీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు పర్యవేక్షణలో రెబ్బెన మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్లో షీటీం ఆధ్వర్యంలో మహిళలకు చట్టాలపై సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీటీం ఇన్చార్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళలపై హింస, ఈవ్‌టీజింగ్, సైబర్ క్రైమ్‌లకు గురైతే, వెంటనే వెంటనే షీటీంను సంప్రదించాలని సూచించారు.
ముఖ్యంగా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిని వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వినియోగించాలని చెప్పారు. ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలోని మహిళలకు రక్షణ కల్పించడం కోసమే షీటీంలు పనిచేస్తున్నాయని చెప్పారు.
అలాగే ఏదైనా అత్యవసర సమయంలో డయల్ 100కు కాల్ చేయాలని పేర్కొన్నారు. షీటీం ఆసిఫాబాద్ ఫోన్ నంబర్ 8712670564కు సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీటీం సభ్యులు డబ్ల్యూహెచ్‌సీ సునీత, డబ్ల్యూపీసీ స్వప్న పాల్గొన్నారు.