నేటి సాక్షి, కోటపల్లి: ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని చెన్నూరు, కోటపల్లి మండలాల్లో ఘనంగా నిర్వహించాలని ఆదివాసీ నాయకుడు చెఢంక మాంతయ్య పేర్కొన్నారు. సోమవారం చెన్నూరు మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాంతయ్య మాట్లాడుతూ చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్, వేమనపల్లి, నెన్నెల మండలాల పరిధిలోని అన్ని ఆదివాసీ గ్రామాల ప్రజలు అందరూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు దుగ్నే జైలు, బండి రమేష్, జేక శేఖర్, బిస్కుల లక్ష్మణ్, ఆత్రం మధుకర్, ఈగం లక్ష్మణ్, పెద్దల వెంకటేష్, ఈగం మహేష్ తదితరులు పాల్గొన్నారు.