బెజ్జంకి,నేటి సాక్షి: శాసనసభలో ఒక మహిళా ఎమ్మెల్యే పై సీఎం రేవంత్ రెడ్డి అనుచితుల వ్యాఖ్యలు చేయడం తగదని మాజీ ఎంపీపీ లింగాల నిర్మల అన్నారు. మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శాసనసభలో చట్టాలను అమలు చేసే శాసనసభ్యులను అవమానించడం బాధాకరం. బాధ్యత గల రాష్ట్ర ముఖ్యమంత్రి సమన్వయంతో మేలాగాల్సిన బాధ్యత గల వ్యక్తి మహిళా శాసనసభ్యు రాలు పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.