Saturday, January 11, 2025

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం

పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్ష

    * జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

    నేటి సాక్షి – జగిత్యాల క్రైం

    విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందుతున్న ఏ.ఎస్.ఐ లు ప్రభాకర్ రెడ్డి , హసన్ మహమ్మద్ గార్ల ని శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను ఎస్పీ అశోక్ కుమార్ అందజేశారు.

    బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అన్నారు. విజయవంతంగా సర్వీస్ పూర్తి చేసిన అధికారుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చెప్పారు. పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావిజీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.
    అనంతరం పదవి విరమణ పొందిన అధికారులను పోలీసు వాహనంలో ఎక్కించి పోలీస్ బ్యాండ్ తో ఘనంగా వీడ్కోలు పలికారు.
    ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (AR) భీమ్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్, వేణు, పాల్గొన్నారు.


    Related Articles

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    - Advertisement -spot_img

    Latest News