* జిల్లా స్థాయి మండల వైద్యాధికారి అధికారులతో సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
నేటి సాక్షి – కోరుట్ల
జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియం mpo, ఎంపీడీవో, మండల వైద్యాధికారి, పీహెచ్సీ ఆశ వర్కర్ సూపర్వైజర్లతో, సమీక్ష నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా సీజన్ వ్యాధుల పట్ల డెంగ్యూ కేసులపై మండల ప్రాథమిక ఆసుపత్రిలో నమోదైన డెంగ్యూ ఫీవర్ కేసులపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో కేసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ గ్రామంలో ఆశా వర్కర్ ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేయాలని , గ్రామ పంచాయతీలు చెత్త ట్రాక్టర్లు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించాలని డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని డ్రైనేజీ శానిటేషన్ నిత్యం జరపాలని పంచాయతీ సెక్రెటరీ గ్రామాలు పరిశుభ్రత పై క్షేత్రస్థాయిలో మెరుగుపరచాలని సూచించారు. కొడిమ్యాల , కథలాపూర్ , ఖిలాగడ్డ, పిహెచ్సిలు, 80 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి తెలిపారు. క్షేత్రస్థాయిలో ఫీవర్ సర్వే చేయాలని ఫీవర్ వచ్చిన వారికి తక్షణమే పరీక్షలు నిర్వహించాలని. డెంగ్యూ కేసులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవో MPO, అందరూ కచ్చితంగా పంచాయతీ సెక్రటరీలు సమయపాలన పాటించాలి ఆదేశాలు ఇచ్చారు. సమయానికి రాని పంచాయతీ సెక్రెటరీలపై సస్పెండ్ చేయాలని ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమములో , అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గౌతమ్ రెడ్డి, డిపిఓ, రఘువరన్, సంబంధిత అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.