నేటి సాక్షి, కోటపల్లి.
కోటపల్లి మండలంలోని బీఆర్ఎస్ నాయకులు నిరసనకు బయలుదేరగా పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్ మాట్లాడుతూ తెలంగాణ ఆడ బిడ్డలు, బీఆర్ ఎస్ పార్టీ సీనియర్ మహిళా శాసన సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ల పైన రాష్ర్ట ముఖ్యమంత్రి చేసిన నీచమైన వ్యాఖ్యలకు ప్రజాస్వామ్య యుతంగా నిరసనకు బయలుదేరిన నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఆడ బిడ్డలపై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని అన్నారు.