వీణవంక మండలం చల్లూరు గ్రామంలో కార్గో కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు
నేటి సాక్షి, వీణవంక:
వీణవంక మండలం చల్లూరు గ్రామ పరిసర ప్రాంత ప్రజలు వ్యాపారస్తుల సౌకర్యం కొరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో చల్లూరు గ్రామ కేంద్రంలో కార్గో కేంద్రాన్ని కరీంనగర్ కార్గో మేనేజర్ రామారావు గారు, రాజు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అన్వేష్ ,ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ చంద్రమౌళి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్టీసీ ద్వారా పార్సిల్ కొరియర్ సర్వీస్ ద్వారా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలో పలు పట్టణాలలో అందుబాటులో ఉందని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పట్టణాలకు పార్సిల్ లో కొరియర్ కవర్లు తక్కువ చార్జీతో వేగంగా రవాణా చేస్తారని, ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం వీణవంక జమ్మికుంట హుజురాబాద్ కార్గోలను తనిఖీ చేశారు.