నేటి సాక్షి, జగదేవపూర్:
తల్లిపాలతోనే సంపూర్ణ ఆరోగ్యమని సిడిపిఓ కరుణాశ్రీ అన్నారు. తల్లిపాల వారోత్సవాల భాగంగా శుక్రవారం జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో అంగన్ వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆగస్టు ఒకటి నుంచి వారం రోజులపాటు అంగన్ వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. పుట్టిన బిడ్డకు వెంటనే తల్లి ముర్రుపాలు తాగించాలని దీంతో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని వివరించారు. తల్లిపాలు పిల్లలకు అమృతము లాంటి వని, రెండేళ్ల వరకు తప్పకుండా పిల్లలకు తల్లిపాలు పట్టించాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై పాలింతలు, గర్భిణీ స్త్రీలు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.అంగన్ కేంద్రాల్లో నూతనంగా చేరిన పిల్లలకు అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 65 ఏళ్లు పూర్తయిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పదవి విరమణ పొందడంతో వారికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైద్యాధికారి అఖిల, అంగన్‌వాడీ సూపర్ వైజర్లు రజిత, సునీత అంగన్వాడి టీచర్లు రుక్మిణి కళ తదితరులు పాల్గొన్నారు.