నేటిసాక్షి, సైదాపూర్ :
సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో అంబేద్కర్ కూడలి వద్ద మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలభిషేకం చేశారు .
30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పోరాటానికి ప్రతిఫలంగా సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణను ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రo మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన మాదిగ మరియు ఉపకులాల ప్రజలకు రిజర్వేషన్లలో సమన్యాయం జరిగే విధంగా సుప్రీంకోర్టు తీర్పురావటం హర్షించదగినదని . దీనివల్ల షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న ఉపకులాల అందరికీ జనాభా దామాషా ప్రకారం సమాన అవకాశాలు దక్కుతాయని వివరించారు. బీసీలలో ఏ బి సి డి వర్గీకరణ ఏ విధంగానైతే ఉండి బీసీ లందరూ ఐకమత్యంతో కలిసి జీవిస్తున్నారో అదే విధంగా షెడ్యూల్డ్ కులాల ప్రజలందరూ రిజర్వేషన్ల వర్గీకరణను ఆమోదించి ఐకమత్యంతో తమ హక్కుల సాధన కోసం మరింతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రుద్రారపు రవితేజ ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షుడు, పొడిశెట్టి వెంకట్రాజ్యం మాజీ ఎంపీపీ, డా: తడికమల్ల శేఖర్,మామిడ్ల రవీందర్, మోరె సతీశ్, రుద్రారపు రాజేంద్రప్రసాద్, పవన్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.