నేటి సాక్షి – ఇబ్రహీంపట్నం
తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల కు పెండింగ్ బిల్లులను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని నిరసనగా శుక్రవారం హైదరాబాద్ లో సర్పంచుల నిరసన,ధర్నా కు రాష్ట్రవ్యాప్త తాజా మాజీ సర్పంచ్ సంఘ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండల తాజా మాజీ సర్పంచ్ లను ఇబ్రహింపట్నం ఎస్ ఐ అనిల్ ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లు మాట్లాడుతూ ప్రతి గ్రామాల్లో అభివృద్ధి కోసం సర్పంచులు అప్పులు తీసుకొచ్చి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందని, ప్రజలకు పారిశుద్ధ్య నీటి అన్ని రకాల వసతులను కల్పించడంలో సర్పంచులు చేసిన కృషిచేశమని, అలాంటి వారికి పెండింగ్ బిల్లులు చెల్లించి చేదోడుగా నిలవాల్సిన ప్రభుత్వం పెండింగ్ బిల్లులను అమలు చేయకపోవడమే కాకుండా గ్రామ అభివృద్ధి చేసిన సర్పంచులను పోలీస్ స్టేషన్లో నిర్భందించడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం నీచమైన చర్యగా భావిస్తున్నామని ప్రజలందరూ ఈ నిర్బంధాలను గమనిస్తున్నారని రానున్న గ్రామ స్థాయి ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారన్నారు. ఇక్కడ తాజా మాజీ సర్పంచులు సంగం సాగర్, దాసరి పోశెట్టి,గుంటి దేవయ్య, దోంతుల తుక్కరాం తదితరులు ఉన్నారు.