నేటి సాక్షి, కరీంనగర్: స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలకు చెందిన విద్యార్థులు ‘ఒలింపియాడ్ ఇండియన్ టాలెంట్’లో బంగారు, రజతం, కాంస్యంతో పాటు మెడల్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ సాధించారు. ఈ మేరకు శనివారం పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. దీనికి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్రెడ్డి ముఖ్యతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పోటీపరీక్షల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉండాలని, విజయం సాధించాలనే ఉత్సాహం ఉండాలని, తద్వారా సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు పుస్తక పఠనం, సాధన, సృజనాత్మకత, పోటీతత్వాన్ని మెరుగుపర్చుకొని, ఉత్తమంగా ఉండి సమాజంలో మెదలాలని కోరారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు అనుగుణంగా ఈ వనరులను సమకర్చడమే కాకుండా వివిధ స్థాయిలో నిర్వహించబడే పోటీ పరీక్షల్లో పాల్గొని ఘనవిజయాలను నమోదుచేసి ఆదర్శంగా ఉండాలని సూచించారు.
ఈ క్రమంలో ప్రముఖ ఒలింపియాడ్ల నిర్వహణ సంస్థ అయిన ‘ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్’లో పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్రంలో, వివిధ తరగతుల్లో అగ్రస్థానం సాధించడమే కాకుండా బంగారు, రజలం, కాంస్యం, మెడల్ ఆఫ్ ఎక్స్లెన్స్ సాధించడం చాలా గొప్ప విషయమని చెప్పారు. విజేతలందరికీ పుష్పగుచ్చాలను అందచేసి, భవిష్యత్తులో మరిన్ని సంచలనాత్మక ఫలితాలను నమోదు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మ్యాథ్స్ విభాగంలో..
ఎండీ గౌస్ మొహినుద్దీన్ బంగారు పతకం, సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్లెన్స్ సాధించాడు. జీ జోయల్ డెవిస్(5వ తరగతి) బంగారు పతకం, సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్లెన్స్, డీ చంద్రహాన్(6వ తరగతి) బంగారు పతకం, సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్లెన్స్, ఎన్ శ్రీహర్షిని(7వ తరగతి) బంగారు పతకం, సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్లెన్స్, ఎన్ సాధ్విక్(7వ తరగతి) కాంస్యపతకం, సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్లెన్స్, ఏ అతర్వ(7వ తరగతి) రజత పతకం, సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్లెన్స్, ఏ గౌతమి(7వ తరగతి) రజత పతకం, సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్లెన్స్, పీ శృతిసాగర్(8వ తరగతి) కాంస్యం, సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్లెన్స్, జీ సాయి సంహిత(8వ తరగతి) బంగారు పతకం, సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్లెన్స్ తదితరుల విద్యార్థులు వివిధ పతకాలను కైవసం చేసుకున్నారు.
వ్యాస రచన విభాగంలో..
ఎన్ రిషంత రెడ్డి(5వ తరగతి) బంగారు పతకం, సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్లెన్స్, చేతన్ శ్రీ హేమంత్(10వ తరగతి) బంగారు పతకం, సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్లెన్స్ సాధించారు.
డ్రాయింగ్ విభాగంలో..
ఎన్ విష్ణుచరణ్(6వ తరగతి) బంగారు పతకం, కే లాస్యశ్రీ,(7వ తరగతి) బంగారు పతకం, సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్లెన్స్, ఏ శ్రీసహస్ర( 8వ తరగతి) బంగారు పతకం, సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్లెన్స్ సాధించారు.