- వైద్య సిబ్బందిని నియమించాలి
- ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
- రోగులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
- కలెక్టర్‌ను కోరిన వొడితెల ప్రణవ్
నేటి సాక్షి, హుజూరాబాద్(రాఘవుల శ్రీనివాసు): హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఆన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు పాటుపడాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ మంగళవారం ఒక ప్రకటనలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని కోరారు. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ దవాఖానలో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. రాబోయే రోజుల్లో దవాఖానాలకు అవసరమయ్యే నిధులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి తీసుకొచ్చేల కృషి చేస్తానని ఆయన తెలిపారు.